Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో కొత్తగా 16 వేలకు పైగా కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India registers more than 16K corona cases
  • గత 24 గంటల్లో 13,958 మంది రికవరీ 
  • దేశంలో 1,13,864కి పెరిగిన యాక్టివ్ కేసులు
  • 4.85 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
దేశంలో గత 24 గంటల్లో 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 13,958 మంది కరోనా నుంచి కోలుకోగా... 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,13,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,35,18,564కి పెరిగింది. వీరిలో 4,28,79,477 మంది కోలుకున్నారు.

ఇక ఇప్పటి వరకు 5,25,223 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.85 శాతంగా, రికవరీ రేటు 98.54 శాతంగా, క్రియాశీల రేటు 0.26 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,98,21,197 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 1,78,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
India
corona virus
Updates

More Telugu News