ఉదయ్ పూర్ టైలర్ హంతకులతో మాకు సంబంధాలు లేవు: కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ స్పందన
- టైలర్ కన్హయ్యలాల్ దారుణహత్య
- నిందితులు రియాజ్, గౌస్ అరెస్ట్
- బీజేపీ నేతలతో కలిసున్న ఫొటోలు పంచుకున్న కాంగ్రెస్
- నేతలతో ఎవరైనా ఫొటోలు దిగొచ్చన్న బీజేపీ
దీనిపై బీజేపీ రాజస్థాన్ విభాగం స్పందించింది. ఆ నిందితులిద్దరితో తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. రాజకీయ నేతలతో ఎవరైనా ఫొటోలు దిగొచ్చని, అంతమాత్రాన వారు బీజేపీలో సభ్యులైపోతారా? అంటూ రాజస్థాన్ బీజేపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు సాదిక్ ఖాన్ ప్రశ్నించారు. కాగా, ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా టైలర్ కన్హయ్యలాల్ హత్యపై స్పందిస్తూ, నిందితుడు రియాజ్ అట్టారీ బీజేపీ కార్యకర్త అని ఆరోపించారు.