అక్టోబరు 1 నుంచి కార్లు, బస్సులకు కొత్త రకం టైర్లు!
- ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ 142:2019’లో నిర్దేశించినట్టుగా కొత్త టైర్లు ఉండాలన్న కేంద్రం
- టైర్లకు రోలింగ్ రిసిస్టెన్స్, వెట్ గ్రిప్, రోలింగ్ సౌండ్ ఎమిషన్ తప్పకుండా ఉండాలని సూచన
- వీటి వల్ల ఇంధన వినియోగ సామర్థ్యం పెరుగుతుందన్న కేంద్రం
ఈ నిబంధనల అమలుతో ‘యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ కమిషన్ ఫర్ యూరప్’ స్థాయి ప్రమాణాలను భారత్ కూడా అచరణలోకి తెచ్చినట్టు అవుతుందని వివరించింది. అంతేకాదు, ఈ మార్పుల వల్ల ఇంధన వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, ప్రమాదాలు కూడా తగ్గుతాయని పేర్కొంది. ఇప్పటికే పాత డిజైన్లో తయారైన టైర్లను వచ్చే ఏడాది మార్చి 30 వరకు ఉపయోగించుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.