తెలంగాణ ఉద్యమంపై బీజేపీ ఫొటో ఎగ్జిబిషన్... ప్రారంభించిన జేపీ నడ్డా
- హెచ్ఐసీసీలో రేపటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- గొల్లకొండ ఎగ్జిబిషన్ పేరిట బీజేపీ తెలంగాణ శాఖ ఫొటో ఎగ్జిబిషన్
- ఉద్యమ చరిత్రను నడ్డాకు వివరించిన లక్ష్మణ్, బండి సంజయ్
శని, ఆదివారాల్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం శుక్రవారం సాయంత్రానికే హైదరాబాద్ చేరుకున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీ కె. లక్ష్మణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు జేపీ నడ్డాకు తెలంగాణ ఉద్యమం గురించి వివరించారు.