తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి... వివరాలు ఇవిగో!

Telangana corona details
  • గత 24 గంటల్లో 25,521 కరోనా పరీక్షలు
  • 468 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 253 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 246 మంది
  • ఇంకా 4,643 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన ఒక్కరోజు వ్యవధిలో 25,521 కరోనా పరీక్షలు నిర్వహించగా, 468 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 253 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39, సంగారెడ్డి జిల్లాలో 34 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,00,944 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,92,190 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,643 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Details
New Cases

More Telugu News