విడిపోతున్నారనే వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ
- ఇద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు
- పనికిమాలిన సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందన్న హేమచంద్ర
- కొన్ని రోజులుగా ఇన్స్టాలో పాలోయర్స్ పెరిగిపోయారన్న శ్రావణ భార్గవి
తన పాటల కంటే పనికిమాలిన సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని హేమచంద్ర తెలిపాడు. గత కొన్ని రోజుల నుంచి తన ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్, యూట్యూబ్ ఛానల్ కి వ్యూస్ పెరిగిపోయాయని శ్రావణ భార్గవి చెప్పారు. ఇప్పుడు తనకు గతంలో కంటే ఎక్కువ పని, సంపాదన లభిస్తోందని అన్నారు. వీరిద్దరూ పెట్టిన పోస్టులతో విడాకుల వార్తకు చెక్ పడినట్టయింది.