'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్'
- మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ
- జులై 1వ తేదీన ట్రైలర్ రిలీజ్
- జులై 14వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'బుల్లెట్' సాంగ్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత వదిలిన 'విజిల్' సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు - తమిళ భాషల్లో కలుపుకుని ఇప్పటికే ఈ పాట 12 మిలియన్ ప్లస్ వ్యూస్ ను తెచ్చుకోవడం విశేషం.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. జులై 1వ తేదీన .. రాత్రి 7:57 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను, జులై 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.
.