చందమామపై అడుగు పెట్టేద్దాం.. ముందస్తు శాటిలైట్ క్యాప్ స్టన్ ను ప్రయోగించిన నాసా

Lets step on the moon NASA launches Capstone satelite
  • సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి వెళ్లేందుకు మార్గం సుగమం
  • ఆర్టిమిస్–1 మిషన్ లో భాగంగా నాసా తాజా ప్రయోగం
  • నాలుగు నెలల తర్వాత చంద్రుడి సమీప కక్ష్యలోకి చేరనున్న ఉప గ్రహం
సుమారు 50 ఏళ్ల తర్వాత తిరిగి మానవుడు చందమామపై అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. చంద్రుడిపైకి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలను తలపెట్టిన నాసా.. అ దిశగా ముందస్తు పరిశీలన కోసం ‘క్యాప్ స్టన్’ ఉపగ్రహాన్ని మంగళవారం ప్రయోగించింది. న్యూజిలాండ్ లోని తూర్పు మహియా పెనిన్సులా నుంచి రాకెట్ ల్యాబ్ సంస్థకు చెందిన ఎలక్ట్రాన్ రాకెట్ ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. చంద్రుడిపై మనిషి అడుగు పెట్టేందుకు ‘క్యాప్ స్టన్’ ఒక గేట్ వే అని నాసా ప్రకటించడం గమనార్హం.

శాటిలైట్ చిన్నదే.. పని పెద్దది..
 
  • తాజాగా నాసా ప్రయోగించిన ‘క్యాప్ స్టన్’ ఓ పెద్ద సైజు సూట్ కేసు పరిమాణంలో ఉంటుంది. ఇది నానో శాటిలైట్ అయినా కూడా.. అది నిర్వర్తించే బాధ్యతలు చాలా పెద్దవేనని నాసా చెప్తోంది.
  • ఈ ఉప గ్రహం మొదట భూమి చుట్టూ తిరుగుతూ గ్రావిటీ నుంచి శక్తిని పుంజుకుని నాలుగు నెలల తర్వాత చంద్రుడి సమీపంలోకి చేరుతుంది.
  • దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి ఉత్తర ధ్రువానికి అత్యంత సమీపంగా 1,600 కిలోమీటర్లు, దూరంగా 43,500 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తుంది.
  • ఈ సమయంలో చంద్రుడిపై వివిధ ప్రాంతాలను, అక్కడి పరిస్థితులను జల్లెడ పడుతుంది. 
  • క్యాప్ స్టన్ లో అత్యాధునిక పరికరాలు, రాడార్లు ఉన్నాయని.. భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రం నుంచి పెద్దగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే తనకు నిర్దేశించిన పనులను నిర్వర్తించేలా ఈ ఉప గ్రహాన్ని తీర్చిదిద్దామని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
  • ఇందులో వెల్లడైన డేటా ఆధారంగా నాసా మానవ సహిత అంతరిక్ష యాత్రలో తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలు తుది నిర్ణయానికి రానున్నారు.

Go Back to Shorts
Nasa
Satelite
Moon Mission
Nasa manned Mission
Artemis
CAPSTONE

More Telugu News