ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్.. నేడు ప్రారంభించనున్న కేసీఆర్
- రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రూ. 276 కోట్లతో పది అంతస్తుల్లో నిర్మాణం
- నాలుగు వేల సంస్థలకు పైగా స్పేస్
- విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న భవనం
ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ కూ యాప్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుండగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరోమోటార్స్, ఫొంటాక్, వెబ్3 సంస్థలతో టీహబ్ ఒప్పందాలు చేసుకోనుంది. కాగా, టీహబ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భవనాన్ని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.


