Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లయిన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన అలియా భట్, రణబీర్ కపూర్

Alia Bhatt Ranbir Kapoor to welcome first child
  • సోనోగ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న అలియాభట్
  • త్వరలోనే తమ బేబీ వస్తోందని ప్రకటన
  • ఏప్రిల్ 14న జరిగిన వివాహం
బాలీవుడ్ నటి అలియాభట్ పెళ్లికి ముందే నెల తప్పిందా..? ఇప్పుడు ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో కాలంగా ప్రేమ, సహజీవనంలో ఉన్న రణబీర్ కపూర్, అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లయిన రెండు నెలలకే అలియాభట్ కడుపు పండిన వార్త బయటకు వచ్చింది. సోనో గ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న ఫొటోను అలియానే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆమె పక్కనే ఉన్న రణబీర్ కపూర్ స్క్రీన్ వైపు చూస్తుండడం ఫొటోలో కనిపిస్తోంది.  

దీంతో రణబీర్, అలియా తల్లిదండ్రులు కాబోతున్నట్టు ధ్రువీకరణ అయింది. ఈ ఏడాది నవంబర్ లో అలియా బిడ్డను ప్రసవించనున్నట్టు తెలుస్తోంది. ‘మా బేబీ త్వరలోనే వస్తోంది’ అంటూ అలియాభట్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. వైద్యులను ఎప్పటికప్పుడు అలియాభట్ పరీక్షలు చేయించుకుంటున్నారని, ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. 
Alia Bhatt
Ranbir Kapoor
first child
pregnant

More Telugu News