కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఒక్క రోజే 50 రాకెట్లు ప్రయోగించిన పుతిన్ సేనలు
- చెర్నిహీవ్‌పై 20, జైటోమిర్ రీజియన్‌పై 30 రాకెట్ల ప్రయోగం
- యారోవ్ మిలటరీ బేస్‌పై రాకెట్ల వర్షం
- రష్యా చేతుల్లోకి లుహాన్స్క్ ప్రావిన్స్
కాగా, ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్ ప్రావిన్స్ పూర్తిగా రష్యా చేతుల్లోకి వెళ్లనుంది. ఇక్కడ రెండుమూడు నగరాల్లో మాత్రం ఉక్రెయిన్ సేనలకు పట్టుంది. 2014 నుంచి లుహాన్స్క్లోని 95 శాతం, డోనెట్స్క్ ప్రావిన్స్‌లో 50 శాతం భూభాగాన్ని రష్యా మద్దతున్న తిరుగుబాటుదారులు నియంత్రిస్తున్నారు. ఇప్పుడు లిసిచాన్స్క్, సీవీరోడోనెట్స్క్ కూడా రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి.