Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య

Puttaparthi municipal commissioner suicide
  • రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మునికుమార్
  • రాయచోటి రైల్వే గేట్ సమీపంలో విషాద ఘటన
  • గతంలో కమలాపురంలో పని చేసిన మునికుమార్
పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ మునికుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. రాయచోటి రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. గతంలో కమలాపురం మున్సిపల్ కమిషనర్ గా కూడా మునికుమార్ పని చేశారు.
Puttaparthi
Municipal Commissioner
Suicide

More Telugu News