Bharat NCAP: వాహ‌నాల‌ భద్రతను బట్టి ఇకపై 'స్టార్' రేటింగ్స్‌!.. కేంద్రమంత్రి వెల్లడి

nitin gadkari say will implement new rating system for vehicles
షార్ట్స్‌లో చూడండి
దేశంలో వాహ‌నాల‌కు స‌రికొత్తగా స్టార్ రేటింగ్‌లు ఇవ్వ‌నున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ శుక్ర‌వారం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అందుబాటులో ఉన్న వాహ‌నాల్లో అత్యంత భ‌ద్ర‌త‌తో కూడిన వాహ‌నం ఏద‌న్న విష‌యం ఈ రేటింగ్‌ల ద్వారా వినియోగ‌దారుడికి ఇట్టే తెలిసిపోతుంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. భార‌త్ ఎన్‌సీఏపీ (భార‌త్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌) పేరిట ఈ కొత్త రేగింట్ పద్ధతిని అమ‌లులోకి తీసుకురానున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 

ఈ రేటింగ్‌లు ఇవ్వ‌డానికి ఆయా వాహ‌నాల‌కు క్రాష్ టెస్టులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. ఈ టెస్టుల్లో వ‌చ్చే ఫ‌లితాల ఆధారంగానే భార‌త్ ఎన్‌సీఏపీ రేటింగ్‌లు ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు. గ్లోబ‌ల్ క్రాస్ టెస్టుల‌కు అనుగుణంగానే ఈ టెస్ట్‌ల‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. 

ఈ రేటింగ్ ప‌ద్దతి వ‌ల్ల వాహ‌న ప‌రిక‌రాల త‌యారీదారుల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ నెలకొంటుంద‌ని గ‌డ్క‌రీ అభిప్రాయ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో దేశీయ వాహ‌నాల ఎగుమ‌తులు కూడా పెరుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ కొత్త విధానం అమ‌లులోకి వ‌స్తే... భార‌త వాహ‌న రంగం స్వ‌యం స‌మృద్ధి సాధిస్తుంద‌ని కూడా గ‌డ్క‌రీ తెలిపారు.
Go Back to Shorts
Bharat NCAP
Nitin Gadkari
BJP
Vehicle Rationgs
Crash Tests

More Telugu News