రూట్ ‘బ్యాట్ మ్యాజిక్’ను అనుకరించి నవ్వులపాలైన కోహ్లీ.. వీడియో వైరల్
- పిచ్ పై బ్యాటును నిటారుగా నిలబెట్టిన ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్
- అదే ప్రయత్నం చేయబోయి విఫలమైన కోహ్లీ
- మ్యాజిక్ కాకుండా రూట్ సెంచరీలు కాపీ కొట్టాలంటూ నెటిజన్ల సూచన
ఈ సమయంలో కోహ్లీ.. రూట్ ను అనుసరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. అది బ్యాటింగ్ లో, సెంచరీలు కొట్టడంలో కాదు. ‘బ్యాట్ మ్యాజిక్’లో..! కొన్ని రోజుల కిందట న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో రూట్ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో నిల్చున్నప్పుడు తన బ్యాట్‌ను ఎలాంటి సపోర్ట్ లేకుండానే కాసేపు పిచ్‌పై నిటారుగా నిలబెట్టి ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో అప్పుడు వైరల్ అయ్యింది. రూట్ కు మ్యాజిక్ కూడా తెలుసు అనుకున్నారంతా.
తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీసెస్టస్ కౌంటీ జట్టుతో గురువారం మొదలైన వామప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇలాంటి మ్యాజిక్ చేయబోయాడు. తను కూడా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్నప్పుడు బ్యాట్ ను నిటారుగా నిలబెట్టబోయాడు. కానీ, బ్యాట్ వెంటనే కింద పడిపోయింది. రెండు మూడుసార్లు ప్రయత్నించినా అది కుదరలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. రూట్‌ను కాపీ కొట్టే ప్రయత్నంలో కోహ్లీ నవ్వుల పాలయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రూట్ మ్యాజిక్ ను కాకుండా అతని సెంచరీలు కాపీ కొట్టాలని మరి కొందరు అంటున్నారు. టైమ్ బాగాలేనప్పుడు ఏం చేసినా వర్కౌట్ కాదని కామెంట్లు చేస్తున్నారు.