Revanth Reddy: రేపు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి

Revanth reddy going to Chanchaguda jail tomorrow
షార్ట్స్‌లో చూడండి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి కేసులో అరెస్టయిన యువకులతో ములాఖత్ అయ్యేందుకు ఆయన జైలుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. 

మరోవైపు అరెస్టయిన యువకుల కోసం అడ్వొకేట్లను నియమించినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అగ్నిపథ్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Chanchalguda Jail

More Telugu News