Revanth Reddy: కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on CM KCR
  • లక్షల కోట్ల సొమ్ము ఎటుపోతోందంటూ రేవంత్ ప్రశ్న 
  • ఇకనైనా మీ రాజకీయ విన్యాసాలు ఆపాలంటూ వ్యాఖ్య 
  • చిరుద్యోగుల జీతాలు విడుదల చేయాలని డిమాండ్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని విమర్శించారు. అప్పుల ద్వారా, భూముల అమ్మకాల ద్వారా, చమురు ధరల పెంపుతో వ్యాట్ ద్వారా, విద్యుత్, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, బస్సు చార్జీల పెంపు ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తున్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో? అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ఇకనైనా మీ రాజకీయ విన్యాసాలు ఆపి, చిరుద్యోగులైన హోంగార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి వెంటనే మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
Revanth Reddy
CM KCR
Congress
Telangana

More Telugu News