VVS Laxman: మేజర్ సినిమా.. స్ఫూర్తిదాయకం: వీవీఎస్ లక్ష్మణ్

  • ఇదొక సినిమా కాదు.. భావోద్వేగమన్న అభిప్రాయం
  • మీ భావాలను తాకుతుందంటూ కామెంట్
  • అడవి శేష్ గొప్పగా చేశాడని కితాబు
  • తప్పకుండా చూడాలంటూ లక్ష్మణ్ ట్వీట్
NCA Chief VVS Laxman Review Of Major Film

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీ ఆధారంగా తీసిన సినిమా మేజర్. 2008లో ముంబైలోని తాజ్ ప్యాలస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడడం తెలిసిందే. నాడు ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా కాల్పుల్లో మేజర్ ఉన్నికృష్ణన్ ప్రాణాలు విడిచారు. దీన్ని కథగా మలిచి, తానే ఆ పాత్రలో నటించాడు అడివి శేష్. ఇదొక యాక్షన్ డ్రామా ఆధారిత సినిమా. జూన్ 3న ఈ సినిమా విడుదల కాగా, సానుకూల స్పందన అందుకుంది. శశికిరణ్ టిక్కా దీనికి దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

మేజర్ సినిమాకు ఎంతో మంది సెలబ్రిటీలు మద్దతు పలికారు. స్ఫూర్తినిచ్చే ఈ సినిమాను చూడాలంటూ పిలుపునిచ్చారు. మాజీ టీమిండియా క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం మేజర్ సినిమాను చూసి, తన స్పందనతో ఓ ట్వీట్ చేశాడు.

‘‘ఇప్పుడే మేజర్ సినిమాను చూశాను. ఇదొక సినిమా కాదు. ఇదొక భావోద్వేగం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు సంబంధించి స్ఫూర్తినిచ్చే కథనం. అది మీ భావాలను తాకుతుంది. అడివి శేష్ గొప్పగా చేశాడు. దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. తప్పకుండా చూడండి’’ అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. మేజర్ సినిమా పోస్టర్ ను సైతం పోస్ట్ చేశాడు. 

More Telugu News