AP Cabinet: ఈ నెల 22న జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా

AP Cabinet meeting postponed
షార్ట్స్‌లో చూడండి
ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 22న సీఎం జగన్ అధ్యక్షతన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మంత్రిమండలి సమావేశాన్ని ఈ నెల 24కి వాయిదా వేసినట్టు సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. క్యాబినెట్ భేటీ వెలగపూడిలోని ఏపీ సచివాలయం ఆవరణలో ఉదయం 11 గంటలకు ఒకటో బ్లాక్ మొదటి అంతస్తులో జరుగుతుందని వివరించారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ మార్పును అన్ని విభాగాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు గుర్తించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Go Back to Shorts
AP Cabinet
Postpone
CM Jagan
Andhra Pradesh

More Telugu News