దారుణ హత్యకు గురైన కన్నడ నటుడు... మూడు నెలల కిందట భార్య ఆత్మహత్య
- రక్తపు మడుగులో సతీష్ వజ్ర
- రక్తం ఇంటి నుంచి బయటికి పారిన వైనం
- దిగ్భ్రాంతికి గురైన ఇంటి యజమాని
- భార్య తరఫు బంధువులే అన్న అనుమానం
తన ఇంటి సీసీ టీవీ ఫుటేజి పరిశీలించిన ఆయన ఇది హత్యేనని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నటుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
నిన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సతీష్ వజ్రతో గొడవపడినట్టు తెలిసింది. వారే వేట కొడవళ్లతో హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. సతీష్ వజ్ర భార్య ఇటీవలే బలవన్మరణం చెందింది. వారిద్దరూ పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆమె మృతికి ప్రతీకారంగా ఆమె సోదరుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ఓ అంచనాకు వచ్చారు. ఆమె సోదరుడు, ఇతర బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.