ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా?: పేర్ని నాని
- పవన్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం కౌలు రైతులను మోసం చేసింది నిజం కాదా?
- పవన్ భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోంది?
- చంద్రబాబు దత్తపుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్
ప్రస్తుతం పవన్ భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఏం ప్రయోజనం చేస్తోందని పేర్ని నాని ప్రశ్నించారు. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూ అంటూ విమర్శించిన బీజేపీతో మీరు ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చట్టం చేయించాలని అన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని... దత్తపుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము పవన్ కు ఉందా? అని ప్రశ్నించారు.
అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీగోడను కూల్చి వేసిన ఘటనపై పేర్ని నాని స్పందిస్తూ... రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే చర్యలు తీసుకోకూడదా? అని ప్రశ్నించారు. నిజమైన బీసీ నాయకులు ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కబ్జా చేయరని చెప్పారు.