క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌ను మీ జీవితంలో చూసి ఉండరు.. కావాలంటే వీడియో చూడండి
- ఇంగ్లండ్‌లో రెండు క్లబ్‌ల మధ్య మ్యాచ్‌లో ఘటన
- క్యాచ్‌ను అందుకోబోయి పట్టు తప్పి కిందపడిన బౌలర్
- అతడి కాలుకు తాకి మళ్లీ పైకి లేచిన బంతి
- గబుక్కున లేచి పట్టుకున్న బౌలర్
అల్‌డ్విక్ బౌలర్ అలెక్స్ రైడర్ విసిరిన బంతిని లింగ్‌ఫీల్డ్ బ్యాటర్ బలంగా బాదాడు. అయితే, అది గురితప్పి పిచ్‌పైనే గాల్లోకి లేచింది. అది తనవైపే రావడంతో అలెక్స్ దానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వెనక్కి పడిపోవడంతో చేతుల్లోకి వచ్చిన బంతి కిందికి జారింది. అప్పుడే అద్భుతం జరిగింది.
కిందపడిపోయిన బౌలర్ కాలు గాల్లోకి లేవడంతో ఆ కాలికి తగిలిన బంతి మళ్లీ పైకి లేచింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలెక్స్ గబుక్కున లేచి బంతిని తన చేతుల్లో బంధించాడు. ఊహించని ఈ పరిణామంతో విస్తుపోయిన బ్యాటర్ నిరాశగా వెనుదిరిగాడు. ఊహించని ఈ క్యాచ్‌తో మైదానంలో నవ్వులు విరిశాయి. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.. అద్భుతమైన ఈ వీడియోను మీరూ చూసేయండి.