మరో రికార్డును నెలకొల్పిన నీరజ్ చోప్రా
- పావో నుర్మి గేమ్స్ లో 89.30 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరిన నీరజ్
- పాటియాలాలో జరిగిన పోటీల్లో 88.07 మీటర్ల దూరం విసిరిన వైనం
- తన జాతీయ రికార్డును తానే అధిగమించిన నీరజ్
టోక్యో ఒలింపిక్స్ తర్వాత తొలిసారి ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పావో నుర్మి గేమ్స్ లో చోప్రా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఫిన్ లాండ్ అథ్లెట్ ఒలివర్ హిలాండర్ జావెలిన్ ను 89.83 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు.