చిన్నారులకు మోడ్రన్ క్రాఫు చేసిన ఎమ్మెల్యే సీతక్క... వైరల్ అవుతున్న వీడియో
- రచ్చబండకు వెళుతూ మార్గమధ్యంలో ఆగిన సీతక్క
- చిన్న కుంట వద్ద బాలలకు క్రాఫ్
- నగరాల్లో ఇలాంటి ఆనందాలు దొరకవని వెల్లడి
నగరాల్లో పెద్ద పెద్ద భవంతులు ఉంటాయని, భారీ మౌలిక సదుపాయాల వ్యవస్థలు కనిపిస్తుంటాయని సీతక్క పేర్కొన్నారు. అయతే, చిన్న చిన్న కుంటల్లో స్నానం చేయడం, సహచరులతో కలిసి ఆడుకోవడం వంటి ఆనందాలను నగరాలు ఇవ్వలేవని అభిప్రాయపడ్డారు. రచ్చబండకు వెళుతుండగా ఈ పిల్లలను చూడగానే పాతజ్ఞాపకాలు మనసులో మెదిలాయని వివరించారు.