తెలంగాణలో కొత్తగా 126 మందికి కరోనా

Telangana corona cases details
  • గత 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 75 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 49 మంది
  • ఇంకా 1,116 మందికి చికిత్స
తెలంగాణలో గత 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు నిర్వహించగా, 126 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 27, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8 కేసులు గుర్తించారు. అదే సమయంలో 49 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,94,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,89,357 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,116 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
New Cases
Update

More Telugu News