బీజేపీ చేసిన పాపాలకు ప్రజలెందుకు బాధలు పడాలి?: మమతా బెనర్జీ
- మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు
- దేశవ్యాప్తంగా దుమారం.. పలు చోట్ల హింస
- హౌరాలోనూ అల్లర్లు
- తీవ్రంగా స్పందించిన మమతా బెనర్జీ
గత రెండ్రోజులుగా హింసాత్మక ఘటనలతో హౌరాలో సాధారణ జనజీవనం దెబ్బతిన్నదని మమత వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ అల్లర్ల వెనుక ఉన్నాయని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నిన్న హౌరాలో నిర్వహించిన ఆందోళనలో హింస చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం కూడా హౌరాలో అల్లర్లు జరిగాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో, పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దాంతో ఈ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలపై బుధవారం వరకు నిషేధాజ్ఞలు విధించారు.