రోజువారీగా వీటిని తగ్గిస్తే లివర్ కు మంచిది

11-06-2022 Sat 12:52 | Health
  • పంచదార, ఆల్కహాల్ తో ఎక్కువ ప్రమాదం
  • మైదా పిండి అసలే వద్దు
  • ఫాస్ట్ ఫుడ్స్ తో కాలేయ సమస్యలే కాదు, గుండెకీ చేటే
మన శరీరంలో లివర్ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే తీసుకునే ఆహారం, పానీయాల దగ్గర్నుంచి.. అనారోగ్యం వస్తే తీసుకునే ఔషధాల వరకు ప్రతి ఒక్కదాన్ని ప్రాసెస్ చేసే చిన్న పరిమాణంలో ఉన్న పెద్ద ఫ్యాక్టరీయే కాలేయం. శరీరానికి శక్తిని అందించడంలో, శరీరంలోని హాని కారకాలను బయటకు పంపడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన శరీర అవయవాల్లో అతిపెద్దది కూడా ఇదే. ఆహారం జీర్ణం కావడానికి కావాల్సిన రసాలను ఉత్పత్తి చేస్తుంది. మరి శరీరానికి ఎన్నో సేవలు అందిస్తున్న కాలేయంపై భారాన్ని మోపే ఆహారానికి దూరంగా ఉండడం ఒక్కటే మనం చేయాల్సిన పని. 

షుగర్/చక్కెర
పంచదార మన శరీరానికి అవసరం లేని పదార్థం. కాలేయానికి హాని కలిగించే పదార్థం. షుగర్, చాక్లెట్లు, కుకీలు, సోడాలు తదితర పదార్థాల వల్ల కొవ్వులు పేరుకుపోయి లివర్ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వీలైతే దూరం పెట్టడం లేదంటే చాలా పరిమితం చేయడం ఆరోగ్య రీత్యా అవసరం.

మద్యం
ఆల్కహాల్ సేవనం కాలేయానికి అత్యంత చేటు చేస్తుంది. మద్యం తాగిన తర్వాత కాలేయం దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో జరిగే రసాయన క్రియలు వాపునకు దారితీస్తాయి. కణాలు చనిపోవడానికి, లివర్ ఫైబ్రోసిస్ కు కారణమవుతుంది. అధిక మోతాదులో ఆల్కహాల్ ను దీర్ఘకాలం పాటు తీసుకుంటే లివర్ సిర్రోసిస్ (గట్టి పడిపోవడం) సమస్యకు దారితీస్తుంది. అప్పుడు రక్తపు వాంతులు, కామెర్లు, శరీరంలో అధిక నీరు ఉండిపోవడం, లివర్ కేన్సర్ సమస్యలు కూడా తలెత్తవచ్చు. కనుక ఆల్కహాల్ ను చాలా తక్కువ పరిమాణానికి తగ్గించుకోవాలి. ఒకవేళ లివర్ సమస్యలు కనిపిస్తే ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడమే మంచిది.

మైదాపిండి
గోధుమ పిండిని ప్రాసెస్ చేయగా మిగిలిందే మైదా. రసాయనాలతో ప్రాసెస్ చేస్తే అలా తెల్లటి పిండిగా మైదా మారుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు మినహా పీచుకానీ, విటమిన్లు కానీ, ఎటువంటి పోషకాలు కానీ ఉండవు. రక్తంలో గ్లూకోజ్ ను పెంచుతుంది. అన్ని రకాల బేకరీ ఉత్పత్తులు, బిస్కెట్స్ మైదాతోనే తయారవుతాయి. 

ఫాస్ట్ ఫుడ్
ఫాప్ట్ ఫుడ్స్ తినడానికి స్పైసీగా ఉండొచ్చు. కానీ జీర్ణం కావడానికి కష్టమైనవి. బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కాలేయానికి మంచివి కావు. వీటివల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడడమే కాదు.. వీటిల్లోని శాచురేటెడ్ ఫ్యాట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి, గుండె జబ్బులకు కారణమవుతాయి.

రెడ్ మీట్
రెడ్ మీట్ లో ఉండే భారీ పరిమాణంలోని ప్రొటీన్ ను విచ్ఛిన్నం చేయడం కాలేయానికి తలకు మించిన పనే. అధిక ప్రొటీన్ పోగుపడడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్యలు ఏర్పడతాయి.
foodsharmliveravoid

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more