Rape: సికింద్రాబాద్ లో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారం

Minor Sisters Raped By two Youths Booked under POCSO
  • ఇద్దరు యువకులపై పోక్సో కేసు
  • నిందితులు నవాజ్, ఇంతియాజ్ గా గుర్తింపు
  • ఫేస్ బుక్ ద్వారా పరిచయమై అఘాయిత్యం
హైదరాబాద్ లో మైనర్లపై వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే.. రెండు రోజుల క్రితం కార్ఖానాలో మైనర్ మీద రేప్ ఘటన వెలుగు చూసింది. తాజాగా అంబర్ పేట పరిధిలో ఓ అత్యాచార ఘటన బయటపడింది. 

సికింద్రాబాద్ కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమై ప్రేమ పేరిట నమ్మించి వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండేళ్లుగా వారిపై అత్యాచారం చేస్తున్నారు. బాలికల తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులు నవాజ్ (21), ఇంతియాజ్ (21)లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను అంబర్ పేటకు చెందిన వారుగా గుర్తించారు.
Rape
Crime News
Hyderabad
Hyderabad Police

More Telugu News