రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న కాజల్ అగర్వాల్?

  • ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్
  • గర్భవతిగా ఉన్న సమయంలో కాస్తంత లావైన వైనం
  • బరువు తగ్గి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న కాజల్
టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ రెండేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఏప్రిల్ లో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడికి నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకుంది. మరోవైపు పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత గర్భవతి అయిన తర్వాత సినిమాలకు దూరమయింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు కాజల్ సిద్ధమవుతోందట. 

గర్భవతిగా ఉన్న సమయంలో కాజల్ కాస్తంత లావుగా తయారైన సంగతి తెలిసిందే. వీలయినంత త్వరగా బరువు తగ్గి సినిమాలు చేయాలని భావిస్తోందట. ఇప్పటికే కాజల్ మేనేజర్, ఏజెంట్స్ ఆమె రీఎంట్రీకి తగిన కథ కోసం చూస్తున్నారట. మరి ఆమె మళ్లీ సినిమాల్లోకి వచ్చి అభిమానులను ఎంతమేర అలరిస్తుందో వేచి చూడాలి.

Kajal Aggarwal
Tollywood
Re entry

More Telugu News