తెలంగాణలో తాజాగా 63 మందికి కరోనా

Telangana corona updates
  • గత 24 గంటల్లో 8,392 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 47 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 47 మంది
  • ఇంకా 563 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 8,392 కరోనా పరీక్షలు నిర్వహించగా, 63 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 47 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4, నాగర్ కర్నూలు జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 47 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 7,93,607 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,933 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 563 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Updates
Daily Bulletin
Today Cases

More Telugu News