చార్ ధామ్ యాత్రలో విషాదం... బస్సు లోయలో పడి 17 మంది మృతి
- ఉత్తరాఖండ్ లో ఘటన
- 28 మంది భక్తులతో వెళుతున్న బస్సు
- భక్తులు మధ్యప్రదేశ్ కు చెందినవారు
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన అమిత్ షా
ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీతో మాట్లాడానని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని వివరించారు.