డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి చేరిన టీడీపీ రూ.5 లక్షల సాయం
- హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం
- బాధిత కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు
- చెక్కును సుబ్రహ్మణ్యం కుటుంబానికి అందించిన పార్టీ నేతలు
ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసిన అనంతబాబును పార్టీ నుంచే కాకుండా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంత బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వారైనా, ఆయనను కొండ కాపు కింద చూపెట్టి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించకుండా వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఈ తరహా కుట్రలను టీడీపీ అడ్డుకుంటుందని ఆయన ప్రకటించారు.