పిఠాపురంలో నేడు టీడీపీ ఎస్సీ గర్జన... అనుమతి లేదంటున్న పోలీసులు
- ఎస్వీఎస్ఎన్ వర్మ నేతృత్వంలో ఎస్సీ గర్జన
- టీడీపీ కార్యాలయానికి చేరుకున్న వర్మ
- కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు
ఎస్సీ గర్జనకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్సీ గర్జన నిర్వహించి తీరుతామని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పిఠాపురంలో పోలీసులు భారీగా మోహరించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వర్మకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.