తెలంగాణలో తాజాగా 49 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona update
  • గత 24 గంటల్లో 10,940 కరోనా పరీక్షలు
  • హైదరాబాదు జిల్లాలో 25 కొత్త కేసులు
  • రంగారెడ్డి జిల్లాలో 16 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 50 మంది
  • ఇంకా 520 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,940 కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 25 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2, హనుమకొండ జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 1, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు వెల్లడయ్యాయి. అదే సమయంలో 50 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,93,468 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,837 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 520 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Today Cases

More Telugu News