జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్... గ్యాంగ్ రేప్ నిందితులపై చర్యలకు బీజేపీ డిమాండ్
- ఆమ్నేషియా పబ్లో బాలికపై గ్యాంగ్ రేప్
- ఈ కేసులో హోం మంత్రి మనవడే కీలక నిందితుడన్న రఘునందన్ రావు
- నిందితులను అరెస్ట్ చేయాలంటూ జూబ్లీ హిల్స్ పీఎస్ వద్ద బీజేపీ నిరసన
- పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లిన బీజేపీ శ్రేణులు
ఇదిలా ఉంటే.. గ్యాంగ్ రేప్లో రాష్ట్ర హోం శాఖ మంత్రి మనవడే కీలక నిందితుడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిందితుడు హోం మంత్రి మనవడు కావడంతో అతడిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన బీజేపీ శ్రేణులకు నేతృత్వం వహించిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.