గన్న‌వ‌రం చేరుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్... రేపు పార్టీ విస్తృత స‌మావేశానికి హాజ‌రు

pawan kalyan reaches gannavaram airport
  • రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం విజ‌య‌వాడ‌కు ప‌వ‌న్‌
  • మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో రేపు పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం
  • ఈ స‌మావేశంలో ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న దిశ‌గా ప్ర‌చారం
జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కాసేప‌టి క్రితం విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఆయ‌న విజ‌య‌వాడ వ‌చ్చారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం పార్టీ విస్తృత స్థాయి స‌మావేశాన్ని ప‌వ‌న్ నిర్వ‌హించ‌నున్నారు. శుక్ర‌వారం రాత్రి విజ‌య‌వాడ‌లోనే బ‌స చేయ‌నున్న ప‌వ‌న్ శ‌నివారం పార్టీ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. వెర‌సి రెండు రోజుల పాటు ఆయ‌న విజ‌యవాడ‌లోనే ఉండ‌నున్నారు.

ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌న్న దిశ‌గానూ ఈ స‌మావేశంలో పార్టీ శ్రేణుల‌కు ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన రేప‌టి విస్తృత స్థాయి స‌మావేశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆసక్తి నెల‌కొంది.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Vijayawada
Gannavaram Airport

More Telugu News