Konaseema District: వైసీపీ ఎంపీటీసీపై మంత్రి విశ్వ‌రూప్ కుమారుడి బెదిరింపులు... వైర‌ల్‌గా మారిన ఆడియో

ap minister viswarup son threatens own party mptc
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి పినిపే విశ్వ‌రూప్ కుమారుడు కృష్ణారెడ్డికి చెందిన‌దిగా భావిస్తున్న ఓ ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సొంత పార్టీ వైసీపీకి చెందిన ఎంపీటీసీని బెదిరిస్తూ కృష్ణారెడ్డి అస‌భ్య ప‌ద‌జాలాన్ని కూడా వాడారు. రెండు కాళ్లు విరిచేస్తాన‌ని, అంతు చూస్తానంటూ ఎంపీటీసీపై బెదిరింపుల‌కు దిగారు. ఇదంతా ఫోన్‌లోనే సాగింది. ఈ ఫోన్ సంభాష‌ణ‌కు సంబంధించిన ఆడియో బ‌య‌ట‌కు రాగా.. అది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఇటీవ‌లే కోన‌సీమ జిల్లా పేరును అంబేద్క‌ర్ జిల్లాగా మారుస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ అమ‌లాపురంలో పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ అల్ల‌ర్ల‌లో మంత్రి విశ్వ‌రూప్‌, ఎమ్మెల్యే స‌తీశ్ ఇళ్ల‌ను నిర‌స‌న‌కారులు తగులబెట్టారు. ఈ కేసులో అరెస్టయిన‌ వారిలో వైసీపీ ఎంపీటీసీ అడ‌పా స‌త్తిబాబు కూడా ఉన్నారు. అల్ల‌ర్ల‌లో స‌త్తిబాబు ఉన్నార‌న్న విష‌యం తెలుసుకున్న కృష్ణారెడ్డి ఆయ‌న‌కు ఫోన్ చేసి అంతు చూస్తానంటూ బెదిరించారు.
Go Back to Shorts
Konaseema District
Amalapuram
Pinipe Viswarup
YSRCP

More Telugu News