Andhra Pradesh: ఏసీబీ 14400 మొబైల్‌ యాప్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

ap cm ys jagan launches acb14400 mobile app
షార్ట్స్‌లో చూడండి
అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం నూత‌నంగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఏసీబీ 14400 పేరిట అవినీతి నిరోధక శాఖ రూపొందించిన ఈ మొబైల్ యాప్‌ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం నిర్వ‌హించిన స్పంద‌న‌పై స‌మీక్ష‌లో భాగంగా సీఎం ఈ యాప్‌ను ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ అధికారులు లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదును ఆడియో రూపంలోనే కాకుండా వీడియో రూపంలో కూడా పంప‌వ‌చ్చ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇలా వ‌చ్చిన ఫిర్యాదుల‌ను అవినీతి నిరోధ‌క శాఖ నేరుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి నివేదిస్తుంద‌న్నారు. అవినీతి నిరోధంలో ప్ర‌తి క‌లెక్ట‌ర్‌తో పాటు ఆయా జిల్లాల ఎస్పీల‌కు కూడా బాధ్య‌త ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
YS Jagan
ACB
ACB14400
Mobile App

More Telugu News