రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్
- యూపీ నుంచి రాజ్యసభ బరిలో లక్ష్మణ్
- లక్నోలో నామినేషన్ పత్రాల సమర్పణ
- హాజరైన సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్ష్మణ్ కు అనూహ్యరీతిలో రాజ్యసభ చాన్స్ లభించింది. తొలుత విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. అయితే, వివిధ సమీకరణాలు, సమతూకం, పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నేత అయిన లక్ష్మణ్ పేరును రెండో జాబితాలో చేర్చారు. లక్ష్మణ్ రాజ్యసభకు ఎన్నికైతే, పెద్దల సభలోనూ తెలంగాణ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం ఏర్పడనుంది.