రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్

Lakshman files nomination for Rajyasabha elections
  • యూపీ నుంచి రాజ్యసభ బరిలో లక్ష్మణ్
  • లక్నోలో నామినేషన్ పత్రాల సమర్పణ
  • హాజరైన సీఎం యోగి ఆదిత్యనాథ్
బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ కె.లక్ష్మణ్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో, లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 

లక్ష్మణ్ కు అనూహ్యరీతిలో రాజ్యసభ చాన్స్ లభించింది. తొలుత విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేదు. అయితే, వివిధ సమీకరణాలు, సమతూకం, పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నేత అయిన లక్ష్మణ్ పేరును రెండో జాబితాలో చేర్చారు. లక్ష్మణ్ రాజ్యసభకు ఎన్నికైతే, పెద్దల సభలోనూ తెలంగాణ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం ఏర్పడనుంది.
Go Back to Shorts
Lakshman
Rajya Sabha
Nominations
Yogi Adityanath
Lucknow
Uttar Pradesh
Telangana

More Telugu News