ఎన్టీఆర్ సినిమా తరువాత కొరటాల ప్రాజెక్టు చరణ్ తోనే!

Charan in Koratala Shiva movie update
  • కొరటాలను నిరాశ పరిచిన 'ఆచార్య'
  • త్వరలో పట్టాలపైకి ఎన్టీఆర్ సినిమా 
  • ఆ తరువాత కొరటాల ప్రాజెక్టుకు చరణ్ గ్రీన్ సిగ్నల్ 
  • ఆల్రెడీ ఓకే అయిన కథతోనే సెట్స్  పైకి   
కొరటాల శివ 'ఆచార్య 'కంటే ముందుగా చరణ్ తో ఒక సినిమా చేయాలని కథ రెడీ చేసుకున్నారు. ఆ కథ చిరంజీవికీ .. చరణ్ కి కూడా బాగా నచ్చింది. అయితే అప్పుడు చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. దాంతో తనతో సినిమా చేసుకోమని చిరంజీవి కోరడంతో, ఆయన కథానాయకుడిగా 'ఆచార్య' పట్టాలెక్కింది. 

ఈ విషయాన్ని కొరటాల చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. చిరంజీవి కూడా అదే మాట చెప్పారు. అయితే 'ఆచార్య' సరిగ్గా ఆడలేదు కనుక, కొరటాలతో చరణ్ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? అనే సందేహం అందరిలో తలెత్తింది. ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. 'ఆచార్య' మామూలు దెబ్బ కొట్టలేదు గనుక ఆయనతో చరణ్ చేయకపోవచ్చనే ప్రచారం నడుస్తోంది. 

అయితే 'ఆచార్య' ఫలితాన్ని చిరంజీవి - చరణ్ లైట్ గానే తీసుకున్నారని తెలుస్తోంది. కొరటాలతో సోలో హీరోగా సినిమా చేయడానికి చరణ్ సుముఖంగానే ఉన్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ తో సినిమా పూర్తయ్యాక కొరటాల తరువాత ప్రాజెక్టు చరణ్ తోనే ఉండనుందని అంటున్నారు. ఆ తరువాత సినిమా మాత్రం బాలయ్యతో ఉంటుందని సమాచారం.
Go Back to Shorts
Chiranjeevi
Ramcharan
Koratala Siva

More Telugu News