దేశంలో కొత్తగా 2,338 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India reports 2338 fresh Corona cases
  • గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,134
  • ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,630
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,883
మన దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,338 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,134 మంది కరోనా నుంచి కోలుకోగా... 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 17,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,58,087కి చేరుకుంది. 

ఇదే సమయంలో 4,26,15,574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 5,24,630 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,93,45,19,805 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 13,33,064 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కరోనా క్రియాశీల రేటు 0.04 శాతంగా ఉంది.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News