తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
- ఇప్పటికే నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు
- సర్వ దర్శనానికి 48 గంటల సమయం
- భారీ రద్దీతో భక్తులకు అసౌకర్యమన్న ధర్మారెడ్డి
ఈ పరిస్థితిని భక్తులకు వివరిస్తూ ధర్మారెడ్డి శనివారం రాత్రి విజ్ఞప్తి చేశారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న రద్దీ తగ్గేందుకు కనీసం 2 రోజుల సమయం పడుతుందని, ఆ మేరకు తిరుమల పర్యటనను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, మరింత మంది పెరిగితే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీకి ఇబ్బందిగా మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు. భారీ రద్దీతో భక్తులకు అసౌకర్యం కలిగే ప్రమాదం ఉందని చెప్పిన ఆయన.. అదే జరిగితే తగినంత ఏర్పాట్లు చేయలేదంటూ టీటీడీపై నిందలేస్తారని తెలిపారు.