తెలంగాణలో 47 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో12,971 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 26 కొత్త కేసులు
- రంగారెడ్డి జిల్లాలో 18 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 28 మంది
- ఇంకా 417 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటిదాకా 7,93,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,516 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 417 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
