ప్రిన్సిపాల్ ను ఇల్లంతా తిప్పి కొట్టిన భార్య... వైరల్ వీడియో ఇదిగో!

Wife beaten husband in Haryana
  • హర్యానాలో ఘటన
  • ఏడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న ప్రిన్సిపాల్
  • ఏడాదిగా భార్య చేతిలో దెబ్బలు తింటున్న వైనం
  • ఆధారాలతో సహా కోర్టును ఆశ్రయించిన అభాగ్యుడు
  • భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించిన కోర్టు
హర్యానాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ భార్యా బాధితుడయ్యాడు. పురుషులు కూడా గృహహింసకు గురవుతారన్న దానికి నిదర్శనంలా నిలిచాడు. అజిత్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాలోని ఖర్కారా ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలకు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే, అతడికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

ఆ వీడియోలో అజిత్ యాదవ్ ను అతడి భార్య సుమన్ యాదవ్ ఇల్లంతా తిప్పి కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. కొడుకు చూస్తుండగానే ఆ ఇల్లాలు భర్తపై చేతికందిన వస్తువులతో దాడికి దిగింది. 

ప్రిన్సిపాల్ అజిత్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ, తమకు ఏడేళ్ల కిందట వివాహం జరిగిందని, తమది ప్రేమ వివాహం అని తెలిపాడు. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తాను ఒక్కసారి కూడా భార్య సుమన్ పై చేయిచేసుకోలేదని వివరణ ఇచ్చాడు. 

కానీ, గత ఏడాది కాలంగా భార్య చేతిలో తాను దెబ్బలు తినాల్సి వస్తోందని, ఆమె తనను కొట్టడం ఎక్కువైందని వాపోయాడు. దాంతో ఆధారాల కోసం ఇంట్లో సీసీటీవీ కెమెరాలు బిగించానని, వాటిలో నమోదైన ఫుటేజిని కోర్టుకు సమర్పించానని అజిత్ యాదవ్ వెల్లడించాడు. దాంతో స్థానిక కోర్టు తనకు భద్రత కల్పించేందుకు అంగీకరించిందని తెలిపాడు.
Go Back to Shorts
Wife
Husband
Princiapl
Haryana
Viral Videos

More Telugu News