దినేశ్ కార్తీక్ కొట్టిన షాట్ కి.. అవాక్కయిన కోహ్లీ, కేఎల్ రాహుల్!

Virat Kohli jumps out of seat KL Rahul in disbelief after Dinesh Karthik hits majestic six
  • అలవోకగా సిక్సర్ బాదేసిన దినేష్ 
  • నోరెళ్లబెట్టి చూసిన రాహుల్, కోహ్లీ
  • ట్రెండీగా మారిన వీడియో
ఆటలో కొన్ని అరుదైన విశేషాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో ఆటగాళ్ల నుంచి ప్రేక్షకుల వరకు వారి హావభావాలను గమనిస్తే ఎంతో ప్రత్యేకం అనిపిస్తుంటాయి. ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య బుధవారం మ్యాచ్ లోనూ ఇలాంటి విశేషమే ఒకటి చోటు చేసుకుంది.

ఆర్సీబీ ఆటగాడు దినేష్ కార్తీక్ చాలా సులభంగా కొట్టిన సిక్సర్ షాట్ అటు డగౌట్స్ లో కూర్చున్న విరాట్ కోహ్లీకి, ఇటు మైదానంలో ఉన్న కేఎల్ రాహుల్ ను అవాక్కయ్యేలా చేసింది. కార్తీక్ కొట్టిన షాట్ కు కోహ్లీ, రాహుల్ ఇద్దరూ నోరెళ్లబెట్టి చూడడం ఎంతో ఆసక్తికరం. వావ్.. అద్భుతం అన్నట్టుగా వారి ముఖకవళికలు కనిపించాయి. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండీగా మారింది. లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ 17వ ఓవర్లో వరుసగా మూడు బంతులను బౌండరీకి పంపించి దినేష్ తన బ్యాటింగ్ సత్తా చాటి చెప్పాడు.
Go Back to Shorts
Virat Kohli
KL Rahul
disbelief
Dinesh Karthik
majestic six

More Telugu News