రేపు ఉదయం బెంగళూరుకు కేసీఆర్!.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు మోదీ!
- ఇటీవలే ఢిల్లీ, ఛండీగఢ్‌లలో పర్యటించిన కేసీఆర్
- తాజాగా గురువారం బెంగళూరుకు పయనం
- మోదీకి స్వాగతం చెప్పనున్న మంత్రి తలసాని
- 2.30 గంటల పాటు హైదరాబాద్‌లో మోదీ పర్యటన
ఇదిలా ఉంటే... ఉదయం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కాసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకోనున్నారు. పలు కార్యక్రమాల్లో పాలుపంచుకునే నిమిత్తం హైదరాబాద్ వస్తున్న మోదీ.. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అనంతరం దాదాపుగా 2.30 గంటల పాటు ఆయన హైదరాబాద్‌లో పర్యటిస్తారు. మోదీకి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వాగతం పలకనున్నారు.