శ్రీలంకలో లీటరు పెట్రోలు రూ.420కి చేరిన వైనం
- లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 24.3 శాతం మేర పెంపు
- డీజిల్ ధర 38.4 శాతం పెరుగుదల
- రవాణా ఛార్జీలపై తీవ్ర భారం
మరోవైపు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. రవాణా ఛార్జీలపై భారం మరింత పడుతుండడంతో అన్ని రకాల వస్తువులు, సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆటో డ్రైవర్లు ఇప్పటికే కిలో మీటరుకు ప్రయాణికుడి వద్ద దాదాపు రూ.90 తీసుకుంటున్నారు. శ్రీలంకలో ప్రజలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తో పాటు ఇతర నిత్యావసరాల కోసం భారీగా క్యూ కట్టాల్సి వస్తోంది. మరోవైపు శ్రీలంకలో విద్యుత్ కోతలు, ఆహార పదార్థాల కొరత ప్రజలను వేధిస్తున్నాయి.