సింగిల్ డేలో రెండో ఒప్పందం!. తెలంగాణలోని చిన్న పట్టణాలకూ మీషో సేవలు!
- దావోస్ సదస్సులో తెలంగాణతో మీషో ఒప్పందం
- త్వరలోనే హైదరాబాద్లో మీషో కార్యాలయం
- కేటీఆర్ సమక్షంలో కుదిరిన ఒప్పందం
తాజా ఒప్పందం ప్రకారం మీషో సేవలు ఇకపై తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించనున్నాయి. ఈ మేరకు త్వరలోనే మీషో సంస్థ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. ఇప్పటిదాకా ఈ సంస్థ సేవలు నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఈ సంస్థ సేవలు అందనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మీషో సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.