చంద్రన్న మార్గమే రాజమార్గం!... జ‌గ‌న్ దావోస్ టూర్‌పై నారా లోకేశ్ కామెంట్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రన్న మార్గమే రాజమార్గం!... జ‌గ‌న్ దావోస్ టూర్‌పై నారా లోకేశ్ కామెంట్‌!

nara lokesh satires on ys jagan davos tour
  •  భార్యతో క‌లిసి దావోస్ బ‌య‌లుదేరిన‌ జ‌గ‌న్
  • నాడు దావోస్ ఎందుకు డ‌బ్బులు దండ‌గ అన్నారుగా అంటూ లోకేశ్ ప్రశ్న 
  • ఇప్పుడు ఏకంగా స్పెష‌ల్ ఫ్లైట్‌లో వెళ్లాల్సి వ‌చ్చిందంటూ ఎద్దేవా 
  • బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమోన‌న్న లోకేశ్
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం మొద‌లుపెట్టిన దావోస్ ప‌ర్య‌ట‌న‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు. దావోస్‌లో ఈ నెల 22న ప్రారంభం కానున్న వర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం నిర్వ‌హించ‌నున్న స‌దస్సులో పాలుపంచుకునే ఏపీ ప్ర‌తినిధి బృందానికి సీఎం జ‌గ‌న్ నేతృత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం స‌తీస‌మేతంగా జ‌గ‌న్ దావోస్ బ‌య‌లుదేరారు. గ‌తంలో ఏపీ సీఎం హోదాలో ఈ స‌ద‌స్సుల‌కు చంద్ర‌బాబు హాజ‌రైన విష‌యాన్ని గుర్తు చేస్తూ జ‌గ‌న్‌ ప‌ర్య‌ట‌న‌పై నారా లోకేశ్ సెటైర్లు సంధించారు.
దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ పర్యటన కు వెళ్లాల్సి వచ్చిందన్న లోకేశ్.. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అంటూ వ్యాఖ్యానించారు. త‌న తండ్రి చంద్ర‌బాబును ద్వేషించే వారు, విమ‌ర్శించే వారు సైతం ఆఖ‌రికి ఆయ‌న మార్గంలో న‌డ‌వాల్సిందేన‌ని కూడా లోకేశ్ తెలిపారు. సంక్షేమం నుండి ఐటీ వరకూ.. అమరావతి నుండి విదేశాలు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం అంటూ లోకేశ్ ముక్తాయింపు ఇచ్చారు. ఈ ట్వీట్‌కు త‌న భార్యతో క‌లిసి విమానంలో ఉన్న జ‌గ‌న్ ఫొటోను లోకేశ్ యాడ్ చేశారు.
Nara Lokesh
Chandrababu
TDP
YS Jagan
Davos

More Telugu News