దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

India reports 2364 fresh cases
  • గత 24 గంటల్లో 2,364 కొత్త కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,582
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,419
దేశంలో కరోనా కేసుల నమోదు హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. ఒకరోజు కొత్త కేసులు తగ్గితే, మరో రోజు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఏదేమైనప్పటికి వైరస్ వ్యాప్తి మాత్రం నియంత్రణలోనే ఉంది. గత 24 గంటల్లో 4.77 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 2,364 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,582 మంది కరోనా నుంచి కోలుకోగా... 10 మంది మృతి చెందారు. 

ప్రస్తుతం దేశంలో 15,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.31 కోట్లను దాటింది. 4.26 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,303 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 

ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీ నుంచి 532 కేసులు వచ్చాయి. కేరళలో 596, మహారాష్ట్రలో 307, హర్యానాలో 257, ఉత్తరప్రదేశ్ లో 139 కేసులు నమోదయ్యాయి. దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా, క్రియాశీల రేటు 0.04 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 1,91,79,96,905 డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 13,71,603 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
Go Back to Shorts
corona virus
India
Updates

More Telugu News